రెండు గర్భసంచులు.. ఒక్కో దాంట్లో ఒక్కొక్కరు

by  |
రెండు గర్భసంచులు.. ఒక్కో దాంట్లో ఒక్కొక్కరు
X

ఆడవాళ్లకు అమ్మతనాన్ని ఓ వరంగా భావిస్తారు. అదే ఒకే కాన్పులో కవలలు పుడితే ఇంకా అదృష్టంగా భావిస్తారు. గర్భంలో కవలలు అని తెలిసినపుడే తల్లులు సంతోషిస్తారు. అయితే ఈ విషయంలో కెల్లీ ఫెయిర్‌హాస్ట్‌ పరిస్థితి చాలా ప్రత్యేకం. ఆమెకు కూడా కవలలు పుట్టబోతున్నారు. అందులో వింతేముంది? అంతకంటే ఎక్కువ మందిని ఒకే కాన్పులో కన్నవాళ్లు ఉన్నారని మీరనొచ్చు. అయినా కూడా కెల్లీ ప్రత్యేకం. ఎందుకంటారా? ఆమె రెండు గర్భసంచుల్లో ఒక్కో దాంట్లో ఒక్కో బిడ్డని మోస్తోంది.

అవును.. రెండు గర్భసంచులు ఉండటమే అరుదైన కండిషన్. ఇలాంటి పరిస్థితి 5 కోట్ల మందిలో ఒక్కరికే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా రెండు గర్భసంచులు ఉండటాన్ని వైద్యపరిభాషలో ‘ఉటేరస్ డిడెల్ఫిస్‌’గా వ్యవహరిస్తారు. తనకు రెండు గర్భసంచులు ఉన్నాయని, కవలలు పుట్టబోతున్నారని 12 వారాల స్కాన్‌లో కెల్లీకి తెలిసింది. ఇది చాలా అరుదైన కండిషన్ అని వైద్యులు చెప్పడం తనకు ఆనందాన్ని కలిగించిందని కెల్లీ అన్నారు. అయితే ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు ఉన్న కెల్లీకి రెండో కూతురు పుట్టినపుడు, ఉపయోగపడని గర్భసంచి ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. అయితే అందులో కూడా ఇప్పుడు బిడ్డ పెరుగుతుండటం నిజంగా గొప్పగా అనిపిస్తోందని కెల్లీ చెబుతున్నారు.


Next Story

Most Viewed