డాక్టర్ లేక మహిళ మృతి

దిశ, అమరావతి: ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ అందుబాటులో లేక ఓ మహిళ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా పొదిలో చోటు చేసుకుంది. మల్లవరం గ్రామానికి చెందిన రెడ్డిపోయిన గురవమ్మ అనే మహిళ పాము కాటుకు గురైంది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అందుబాటులో వైద్యులు లేరు. సుమారు గంట సేపు మృత్యువుతో పోరాడిన గురవమ్మ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.

Advertisement