ఎస్ఐ‌ జగదీశ్ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని…

by  |
ఎస్ఐ‌ జగదీశ్ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని…
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎస్ఐ జగదీశ్‌పై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2013లో తన భర్తతో గొడవ విషయాన్ని ఫిర్యాదు చేయడానికి వస్తే తన ఫోన్ నెంబర్ తీసుకుని మాటలు కలిపి సహజీవనం చేశాడని, 2017లో రహస్యంగా వివాహం చేసుకున్నాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని పలుమార్లు బెదిరించాడని తెలిపింది. ఇప్పుడు తమకో కుమారుడు ఉన్నాడని తెలిపింది. తనతో పాటు కుమారుడికి కూడా ప్రాణ భయం ఉందని అందుకే రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించినట్లు మహిళ తెలిపింది.

తనను పెళ్లి చేసుకోవడంతో మొదటి భార్య నుంచి ఇబ్బందులు వస్తున్నాయని, అందుకే తన బాబును తనకు ఇవ్వాలని ప్రతిరోజు బెదిరింపులకు పాల్పడుతూ మానసికంగా హింసిస్తున్నాడని మహిళ మీడియా ముందు గోడును వెళ్లబోసుకుంది. తనను స్టేషన్‌కు పిలిపించి.. ఈ కేసులో నా మొదటి భర్తను ఇన్వాల్వ్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. తన కుమారుడిని ఇచ్చే ప్రసక్తే లేదని, తన మొదటి భర్తకు ఇతడే డైవర్స్ ఇచ్చేలా చేశాడని తెలిపింది.


Next Story

Most Viewed