వాటర్ ట్యాంక్ ఎక్కి వివాహిత హల్‎చల్..!

by  |
వాటర్ ట్యాంక్ ఎక్కి వివాహిత హల్‎చల్..!
X

దిశ, వెబ్‎డెస్క్: కుటుంబ కలహాలతో ఓ వివాహిత వాటర్ ట్యాంక్ ఎక్కి హల్‎చల్ చేసింది. ఈ ఘటన సోమవారం ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వైరా మండలం స్టేజి పినపాక గ్రామానికి చెందిన ఓ మహిళ.. కుటుంబ కలహాలతో గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి కిందకు దూకుతానంటూ నిరసన వ్యక్తం చేసింది. సమాచారం అందుకున్న గ్రామ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వాటర్ ట్యాంక్ నుంచి మహిళను దింపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.


Next Story

Most Viewed