చైన్ స్నాచర్ కు చుక్కలు చూపించిన లేడి

దిశ వెబ్ డెస్క్: చైన్ స్నాచర్‌కు చుక్కులు చూపించిందో లేడి. తన మెడలో చైన్ దొంగిలించాలనుకున్న వ్యక్తిని పట్టుకుని కటకటాల వెనకకు పంపించింది. తప్పించుకునేందుకు దాడి చేస్తున్న భయపడకుండా దొంగను కట్టడి చేసిన ఆ మహిళ ధైర్యాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబ్‌లోని జలంధర్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ యువతి రోడ్డుపై వెళుతోంది. మహిళ ఒంటరిగా వెళుతున్న విషయం గమనించిన దొంగలు ఆమెను బైక్ పై ఫాలో అయ్యారు. కొంత దూరం వెళ్లాక ఆమె మెడలో నుంచి చైన్ లాక్కొని వెల్లేందుకు ప్రయత్నం చేశారు. బైక్ వెనక కూర్చున్న దొంగను ఆ మహిళ గట్టిగా పట్టుకుంది. దీంతో అతను బైక్ దిగి ఆ అమ్మాయిని కొట్టసాగాడు. కానీ ఆ మహిళ అతన్ని వదలలేదు. సహాయం కోసం కేకలు వేసింది. ఇంతలో ఓ పెద్దాయన పరుగెత్తుకు రాగానే బైక్ మీద ఉన్నవాడు పరారు అయ్యాడు. అనంతరం దొంగకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. . సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆమె సాహసాన్ని కొనియాడుతున్నారు

Advertisement