- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డంపింగ్ యార్డ్ వెనుక లవర్‌తో ఉన్న భర్త.. షాకిచ్చిన భార్య
దిశ, వెబ్ డెస్క్: ప్రియురాలితో భర్త ఏకాంతంగా గడుపుతుండగా భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ప్రియురాలిని చితకబాదిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తికి పెళ్లి అయ్యింది. వారికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే, అతను మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత కొద్ది రోజుల నుంచి వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండడంతో అతను తన భార్య, పిల్లలను సరిగ్గా చూసుకోవడంలేదు. దీంతో భార్య ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ఎన్నో సార్లు భర్తకు అలా చేయొద్దని చెప్పింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. సాలూరు డంపింగ్ యార్డ్ వెనుక భాగంలో తన భర్త, అతని ప్రియురాలు ఏకాంతంగా గడుపుతున్నారని భార్యకు తెలిసింది. వెంటనే ఆమె అక్కడికి చేరుకుని వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అయితే, భర్త అక్కడి నుంచి పారిపోగా, ప్రియురాలికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.