- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కంటి నుంచి నెత్తురు.. మహిళను హత్య చేసింది ఎవరు..?

దిశ, కుత్బుల్లాపూర్: బంగారు నగల కోసం గుర్తు తెలియని దుండగులు గృహిణిని హత్యచేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ (భగత్‌సింగ్‌నగర్ కాలనీ)లో జరిగిన ఈ దారుణ హత్య ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. భగత్‌సింగ్‌నగర్‌లో ముప్పిడి మల్లేష్, సువర్ణ(48) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
రోజూ లాగానే కుటుంబ పోషణ కోసం సోమవారం భర్త, కొడుకు పనికి వెళ్లగా.. సువర్ణ ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం సమయంలో కాల్ చేసిన భర్తతో మాట్లాడిన సువర్ణ ఆతర్వాత ఎంతకీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన మల్లేష్ ఇంటికొచ్చి చూడగా.. విగతాజీవిగా కనిపించింది. మెడకు ఉరివేసి, కండ్ల నుంచి రక్తం రావడం, దీనికితోడు మెడలో ఉండాల్సిన బంగారం లేకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. డబ్బు, నగల కోసం తన భార్యను ఎవరో హత్య చేశారని జీడిమెట్ల స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.