అడ్డుకున్నందుకు హోంగార్డును కొట్టిన మహిళ..!

దిశ వెబ్‎డెస్క్: కారును ఆపినందుకు గానూ ఓ మహిళ డ్యూటీలో ఉన్న హోంగార్డును కొట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‎లోని మహోబా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొత్వాలిలో సుభాష్ పోస్ట్ వద్ద రింకీ సింగ్ అనే మహిళ హోంగార్డు విధులు నిర్వహిస్తోంది. అదే సమయంలో రాధా అనే మహిళ మరో అమ్మాయితో పికప్ కారులో వచ్చింది. అక్కడ నో ఎంట్రీ ఉన్నప్పటికీ సదరు మహిళ కారును లోపలికి తీసుకెళ్లాలని పట్టుబడింది. దీంతో ఆ కారును రింకీ సింగ్ నిలిపివేసింది.

దీంతో రాధ కారు దిగి హోంగార్డు రింకీపై దాడికి దిగింది. సిబ్బంది ముందే హోంగార్డు జుట్టు పట్టికొట్టగా.. ఆమెను ఆపడానికి వచ్చిన వినోద్ సింగ్ అనే కానిస్టేబుల్ చేయి కొరికింది. మిగతా సిబ్బంది రాధను విడిపించి స్టేషన్‎కు తరలించారు. రాధపై కేసు నమోదు చేశారు.

Advertisement