వారిపై కేసుల ఉపసంహరణ.. సుమోటోగా హైకోర్టు విచారణ

by srinivas |
high court
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణ అంశంపై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ ఉపసంహరణ కేసును హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. వైసీపీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, విడదల రజని, జక్కంపూడి రాజా, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, మల్లాది విష్ణు, ఎంపీ మిథున్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై క్రిమినల్ కేసుల ఉపసంహరణపై సుమోటోగా కేసు విచారణ నిర్వహించింది.

సుప్రీం తీర్పు మేరకు ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై విచారణ నిర్వహించింది. ఈ కేసుకు సంబంధించి నివేదిక సమర్పించాలని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది. కేసుల ఉపసంహరణకు ఎన్ని ప్రతిపాదనలు వచ్చాయో ఆ నివేదికలో పొందు పరచాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed