- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పినరయి క్యాబినెట్‌లో కొత్తదనం.. పాత మంత్రులకు దక్కని చోటు
తిరువనంతపురం: దేశంలో సీపీఎం అధికారాన్ని కొనసాగిస్తున్న ఏకైక కేరళలో సరికొత్త నిర్ణయాలు తీసుకుని ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నది. గత హయాంలో మంత్రులుగా చేసినవారెవ్వరినీ కొత్తగా మళ్లీ తీసుకోవడం లేదు. పినరయి విజయన్ మినహా కొత్త క్యాబినెట్‌లో అన్నీ కొత్త ముఖాలే కనిపించనున్నాయి. 11 మంది కొత్తవారినే మంత్రులుగా ఎంచుకున్నది. నిపా వైరస్, కరోనా వైరస్ కట్టడిలో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్న మాజీ ఆరోగ్య శాఖ కేకే శైలజా టీచర్‌కూ కొత్త మంత్రి మండలిలో చోటుదక్కలేదు. ఆమెను పార్టీ విప్‌గా ఎన్నుకున్నారు. పినరయి విజయన్ మాత్రమే మరోసారి సీఎం బాధ్యతలు చేపట్టనున్నారు. మంగళవారం ఆయనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన ఎల్‌డీఎఫ్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. 20న మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పినరయి విజయన్‌తోపాటు ప్రమాణ స్వీకారం చేయనున్న 11 మంది ఎంవీ గోవిందన్, కే రాధాక్రిష్ణన్, సాజీ చెరియాన్, కేఎన్ బాలగోపాల్, పీ రాజీవ్, వీఎన్ వాసవన్, వీ శివన్ కుట్టి, ముహమ్మద్ రియాస్, డాక్టర్ ఆర్ బిందు, వీణా జార్జ్, అబ్దుల్ రహ్మన్‌లు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. స్పీకర్‌గా ఎంబీ రాజీశ్‌ను ఎంచుకోగా, మాజీ మంత్రి టీపీ రామక్రిష్ణన్ పార్టీ పార్లమెంటరీ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు