- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలి త్రైమాసికంలో విప్రో నికర లాభం రూ. 2,390 కోట్లు!
దిశ, వెబ్‌డెస్క్ : ఐటీ దిగ్గజ సంస్థ విప్రో 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగియగా, తొలి త్రైమాసికంలో నికర లాభం 0.11 శాతం వృద్ధితో రూ. 2,390.40 కోట్లను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 2,387.60 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఏకీకృత ఆదాయం 1.33 శాతం పెరిగి రూ. 14,913.10 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 14,716.10 కోట్లుగా ఉండేది. విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ త్రైమాసిక ఫలితాలపై స్పందిస్తూ..కొవిడ్-19 వల్ల ఎదురయ్యే పరిస్థితులు సాంకేతిక వ్యయాన్ని తగ్గిస్తాయని, కంపెనీ ఉత్పత్తుల డిమాండ్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని చెప్పారు. కొవిడ్-19 వల్ల తమ కార్యకలాపాలు ప్రతికూలంగానే ప్రభావితమవుతున్నాయని పేర్కొన్నారు. ఇక, ఐటీ సేవల ద్వారా వచ్చే ఆదాయం ఏప్రిల్-జూన్ కాలంలో 1.70 శాతం పెరిగి రూ. 14,595.60 కోట్లకు చేరుకుంది. అయితే, త్రైమాసిక ప్రాతిపదికన 4.58 శాతం క్షీణించిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.