- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమెరికాలో విప్రో స్థానిక మంత్రం!
దిశ, సెంట్రల్ డెస్క్: గత కొంతకాలంగా అమెరికాలో స్థానిక మంత్రం ఎక్కువగా వినిపిస్తోంది. అమెరికాలోని ఏ కంపెనీలైన అక్కడి స్థానిక ఉద్యోగులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు సగానికిపైగా స్థానికులనే ఎంచుకుంటున్నాయి. భారత ఐటీ దిగ్గజం విప్రో సంస్థ 2019-20 వార్షిక నివేదికలో.. అమెరికాలో ఉన్న తమ కంపెనీలో 69.5 శాతం మంది స్థానిక ఉద్యోగులనే నియమించుకున్నట్టు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో మన దేశ కంపెనీ ఆదాయంలో 59.1 శాతం అమెరికా నుంచే వచ్చిందనే విషయం తెలిసిందే. లాటిన్ అమెరికాలో మొత్తం ఉద్యోగాలన్నీ స్థానికులకే నియమించినట్టు, నైపుణ్యం ఉన్న స్థానిక ఉద్యోగులకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు విప్రో పేర్కొంది. విప్రోతో పాటు పలు ఐటీ కంపెనీలు అమెరికాలోని వారికి శిక్షణ ఇచ్చి మరీ నియమించుకుంటున్నాయి. అమెరికాలో ఉన్న భారత ఐటీ కంపెనీలు అనేకం స్థానికులకే ఉద్యోగాలు అధికంగా ఇస్తున్నాయి. అధిక నైపుణ్యం ఉన్న భారతీయులను హెచ్1బీ వీసాలపై తీసుకెళ్లడాన్ని తగ్గిస్తున్నాయి. ఇటీవలి వార్తలను గమనిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా కారణంగా హెచ్1బీ వీసా కేటగిరీ సహా పలు వీసాలను రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. విప్రో కంపెనీ అమెరికాలో స్థానిక ఉద్యోగుల అంశంపై వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇంతకుముందు ఆర్థిక సంవత్సరంలో విప్రో 1,88,270 మంది ఉద్యోగులు ఉండగా, ఇండియా వెలుపల 41 వేల స్థానిక ఉద్యోగులను నియమించుకుంది. అమెరికా, లాటిన్ అమెరికా, కాంటినెంటల్, యూకే, యూరప్, ఇండియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో విప్రో వినియోగదారులకు వీఐనంత వరకూ స్థానికంగానే సేవలను అందిస్తున్నట్టు పేర్కొంది. యూకేలో విప్రో సంస్థలో 33 శాతం స్థానిక వాటా ఉండగా, ఆస్ట్రేలియాలో 40 శాతం, యూరప్‌లో 67.6 శాతం వాటాను కలిగి ఉంది. ఇక, విప్రో కొత్త సీఈవోగా థియర్రీ డెలపోర్ట్ బాధ్యతలను తీసుకున్నారు. ఆయనకు వార్షిక వేతనమ రూ. 38 కోట్లు.