- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- వీడియోలు
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘రానున్న రోజుల్లో సవాళ్లు తప్పవు’
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వైరస్ కారణంగా విమానయాన రంగం భారీగా దెబ్బతిన్నది. అన్ని దేశాల్లో అంతర్జాతీయ, దేశీయ విమాన సేవలు నిలిచిపోయాయి. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో విమానయాన రంగం 40 శాతం లాభాలను నమోదు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయిన తర్వాత నెమ్మదిగా కార్యకలాపాలు మొదలయ్యాయి.
ఈ లాభాలు ఉద్యోగుల వేతనం, ఇంధనం, రుణాల బిల్లుల చెల్లింపుల నుంచి కొంతమేరకు ఊరట లభిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పైగా, గత త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత త్రైమాసికంలో ఎయిర్‌లైన్స్ స్టాక్ సూచీలు మెరుగ్గా ర్యాలీ చేశాయి. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం…ఎయిర్‌లైన్స్ సూచీలు 18 శాతం ర్యాలీ చేశాయి. కార్యకలాపాలు తెరుచుకుంటూ ఉండటంతో విమానయాన పరిశ్రమ క్రమంగా కోలుకుంటోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ వ్యయం, బలమైన బ్యాలెన్స్ షీట్ వల్ల మెరుగైన స్థితిలోనే ఉంది. అయితే, విమానయాన రంగం ప్రస్తుతం కోలుకుంటున్న దశలోనే ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో మరింత దారుణ స్థితిలోకి జారిపోయే ప్రమాదముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్-19 ప్రభావంతో లాక్‌డౌన్ వల్ల నెలల తరబడి విమానయాన సంస్థల కార్యకలాపాలు ఆగిపోయాయి.
తద్వారా బ్యాలెన్స్ షీట్‌పై ప్రభావం పడటం, ప్రభుత్వాలతో పాటు పెట్టుబడిదారుల నుంచి బెయిల్ఔట్ ప్రణాళికలు, ఇంధన ఆదా, నిర్వహణ ఖర్చులు తగ్గిపోవడం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటివరకైతే ఉద్యోగాల తొలగింపు, పలు మార్గాల్లో విమానాల రాకపోకలను ఆపేయడం లాంటి చర్యలను విమానయాన సంస్థలు తీసుకున్నాయి. అయితే, రానున్న రోజుల్లో వీటికంటే పెద్ద సవాళ్లను పరిశ్రమ ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మూలధన సొమ్ము జీరోకి క్షీణించకముందే విమానయాన సంస్థలు కీలకమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.