- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందుబాబులకు దసరా స్పెషల్.. 9 గంటలకే వైన్స్ షాపు ఓపెన్
దిశ, మంథని : మందుబాబులకు సేవలు మరింత త్వరగా అందించాలనుకున్నారో లేక ఎక్సైజ్ అధికారులు స్పెషల్ ఆఫర్ ఇచ్చారో తెలియదు. కానీ.. అక్కడ మాత్రం తెల్లవారుజామునే మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. నిత్యం ఉదయం 10 గంటల తర్వాత ఓపెన్ కావాల్సిన వైన్ షాపులు 9 గంటలకే బార్లా తెరుచుకోవడం విస్మయం కల్గిస్తోంది. పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ కేంద్రంలో చోటు చేసుకున్న ఈ చోద్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దసరా పండుగ నేపథ్యంలో వైన్ షాపులు తెరుచుకోవాలని ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసిందా.? లేక మందుబాబులకు సత్వర సేవలు అందించాలని ముందుగానే షాపులు తెరిచారా అంటూ సెటైర్లు వేస్తున్నారు స్థానికులు. సాధారణంగానే కిక్కిరిసిపోయే వైన్ షాపులు దసరా పండగ సందర్భంగా మరింత ఎక్కువ రద్దీతో ఉంటాయని భావించి ముందస్తు సేవలు అందిస్తున్నారా అని స్థానికులు అంటున్నారు.
ముందుగానే మద్యం షాప్ ఎందుకు తెరిచారనీ సీపీఎం నాయకులు బూడిద గణేశ్, అర్ల సందీప్ లు అడగగా తాము లెక్కలు చూసుకునేందుకు ఓపెన్ చేశామని చెప్పినట్లు వివరించారని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా మద్యం దుకాణం ఓపెన్ చేయడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.