- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వింబుల్డన్ మెయిన్ డ్రా విడుదల
దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా గతేడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పూర్తిగా రద్దయిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది వింబుల్డన్ జూన్ 28 నుంచి ప్రారంభం కానున్నది. ఇప్పటికే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ప్రారంభం కాగా… మెయిన్ డ్రా టోర్నీ మూడు రోజుల్లో మొదలవుతుంది. మెయిన్ డ్రాకు సంబందించిన వివరాలను నిర్వాహకులు శుక్రవారం విడుదల చేశారు. మెన్స్ సింగిల్స్ డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ 1 నోవాక్ జకోవిచ్ తొలి రౌండ్‌లో డ్రాపర్‌తో తలపడనున్నాడు. ఇక గ్రాస్ కోర్ట్ కింగ్ రోజర్ ఫెదరర్ తొలి రౌండ్‌లో మన్నారినోతో పోటీపడనున్నాడు. మెయిన్ డ్రాను పరిశీలిస్తే జకోవిచ్, ఫెదరర్, సిట్సిపాస్‌కు క్వార్టర్ ఫైనల్ వరకు గట్టి పోటీ ఏమీ కనపడటం లేదు. అయితే క్వార్టర్స్‌లో జకోవిచ్, రూబ్లేవ్ తలపడే అవకాశం ఉన్నది. అలాగే ఫెదరర్‌తో మెద్వదేవ్. సిట్సిపాస్‌తో బాటిస్టా పోటీపడవచ్చు. ఇక ఈ ఏడాది వింబుల్డన్ నుంచి తప్పుకుంటున్నట్లు డోమినిక్ థీమ్ ప్రకటించాడు. మణికట్టుకు గాయం కారణంగా తాను గ్రాండ్‌స్లామ్ ఆడలేకపోతున్నట్లు తెలిపాడు. మహిళల డిఫెండింగ్ ఛాంపియన్ సిమోన హెలెప్ కూడా వింబుల్డన్ నుంచి తప్పుకున్నది. గాయం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే రఫెల్ నదాల్, నయోమీ ఒసాకా టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.