ఏపీలో జనసేన గ్రాఫ్ పెరుగుతుందా?

by srinivas |
ఏపీలో జనసేన గ్రాఫ్ పెరుగుతుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు, ఇవాళ విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూస్తే.. ఏపీలో జనసేన గ్రాఫ్ కొద్దికొద్దిగా పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల జనసేన బలంగా తన ప్రభావాన్ని చూపించింది. మొత్తం 1209 సర్పంచులు , 1576 ఉప సర్పంచ్ పదవులు, 4456 వార్డులను జనసేన గెలుచుకుంది. మొత్తం చూస్తే.. 27 శాతం విజయాల్ని నమోదు చేసింది.

ఇవాళ వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జనసేన కొన్నిచోట్ల బలంగా ప్రభావం చూపింది. జనసేన ప్రభావం వల్ల కొన్నిచోట్ల టీడీపీ, వైసీపీ ఓట్లకు భారీగా గండి పడింది. గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం బాగా చూపించింది.

ఇవన్నీ చూస్తే.. ఏపీలో జనసేన గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను పవన్ సీరియస్‌గా తీసుకోలేదు. పవన్ సీరియస్‌గా తీసుకుని ప్రచారం చేసి ఉంటే మరింత ప్రభావం చూపేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story