ఇండిగో.. ఇదంతా ఏంది నివేదిక ఇవ్వండి

by Anukaran |
ఇండిగో.. ఇదంతా ఏంది నివేదిక ఇవ్వండి
X

న్యూఢిల్లీ: ఆన్‌బోర్డులో నిబంధనలు అమలవ్వకుంటే సదరు షెడ్యూల్డ్ ఫ్లైట్‌ను ఆ రూట్‌లో రెండు వారాలపాటు రద్దు చేస్తామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) హెచ్చరించింది. ఫొటోగ్రఫీ సహా ఇతర నిబంధనలు ఉల్లంఘించిన విమానాన్ని ఆ ఘటన తర్వాతి రోజు నుంచి రెండు వారాలపాటు సస్పెండ్ చేసే నిర్ణయం తీసుకున్నట్టు శనివారం ప్రకటించింది.

ఛండీగడ్ నుంచి ముంబయికి వెళ్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ కోసం భౌతిక దూరం సహా పలు నిబంధనలు ఉల్లంఘించి మీడియా ప్రతినిధులు చుట్టుముట్టిన మూడు రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతేకాదు, కంగనా రనౌత్ ప్రయాణించిన ఇండిగో విమానయాన సంస్థపై డీజీసీఏ సీరియస్ అయింది. ఆ ఘటనలో కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుని 15 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించింది. లేదంటే విమానయాన సంస్థ ఇండిగోపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed