- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కలిసికట్టుగా బీజేపీ, జేడీయూ, ఎల్జేపీలు : జేపీ నడ్డా
దిశ, వెబ్ డెస్క్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఎల్జేపీ, బీజేపీ కలిసికట్టుగా బరిలోకి దిగుతాయని కాషాయపార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఎల్జేపీ, జేడీయూల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో బిహార్ బీజేపీ వర్చువల్ మీటింగ్‌లో నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ సారథ్యంలో తాము విజయాన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ అధికార పక్షంపైనే ఆశలు పెట్టుకున్నారని, ప్రతిపక్షాలు దాదాపు సుప్తావస్తలోకి వెళ్లాయని వివరించారు.
విపక్షాలకు భావజాలం లేదని, ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యం లేదని, చిల్లర రాజకీయాల్లోనే ఉన్నాయని విమర్శించారు. కొవిడ్ 19 మహమ్మారిని కట్టడి చేయడంలో, వరదల విపత్తును అధిగమించడంలో బిహార్ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించిందని కొనియాడారు. అక్టోబర్-నవంబర్‌లలో బిహార్ ఎన్నికలు జరగనున్నాయి. కరోనా కాలంలో ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ గైడ్‌లైన్స్ బిహార్ అధికారపక్షం స్వాగతించింది.