ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి

by Shyam |
jagga reddy
X

దిశ, సంగారెడ్డి: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డిలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ దేశవ్యాప్త నిరసనలలో భాగంగా సంగారెడ్డిలోని పాత బస్టాండ్ నుంచి ఐటిఐ ముందు గల సీఎస్ఐ చర్చి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిందని ఆరోపించారు. పేద, మధ్య తరగతి ప్రజలు వంట చేసుకునేందుకు ఉపయోగించే వంట గ్యాస్ ధరలను కూడా పెంచి మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని చేతులెత్తేయడం సరికాదని పేర్కొన్నారు. వరి పండించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు సూచించడం సరికాదని ఆరోపించారు.

ప్రభుత్వాలు మంచి చేస్తాయనే ప్రజలు ఎన్నుకుంటారని కానీ ప్రభుత్వాలు చెప్పినట్లు వినాలని ప్రజలను అనడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని లేదంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షరాలు నిర్మలా జగ్గారెడ్డి, టీ‌పీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్‌, కాంగ్రెస్ నాయకులు శంకర్ రెడ్డి, ఆంజనేయులు, ప్రభు, నవాజ్, రాజు‌‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed