- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏప్రిల్ 2 తర్వాతే లాక్‌డౌన్‌పై నిర్ణయం.. డిప్యూటీ సీఎం
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు మాత్రం కరోనా నిబంధనలను పాటించడం లేదు. ప్రజల తీరుతో విసిగిపోయిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఇలాగే కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ పోతే బలవంతంగా లాక్ డౌన్ పెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఏప్రిల్ 2 వరకు పరిస్థితిని చూసి.. ఆ తర్వాత లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పూణెలో కరోనా పరిస్థితిపై ఆయన ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. హోలీ పండుగ నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
గుంపులు గుంపులుగా ఎవరూ తిరగవద్దని హెచ్చరించారు. భౌతిక దూరం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లేదంటే వచ్చే వారం నుంచి కఠినమైన లాక్ డౌన్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసులు ఇలాగే పెరుగుతూ పోతే లాక్ డౌన్ తప్ప వేరే మార్గమే లేదని అధికారులు చెప్పారన్నారు.