రైనా రీఎంట్రీకి బీసీసీఐ అనుమతిస్తుందా?

by  |
రైనా రీఎంట్రీకి బీసీసీఐ అనుమతిస్తుందా?
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ సీజన్ 13లో ఒక్క బంతి కూడా పడకముందే సురేష్ రైనా వివాదానికి తెరలేపాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో ఒకేసారి 13 మంది కరోనా బారిన పడటంతో అదే రోజు సురేష్ రైనా ఇండియాకు తిరిగి వచ్చేశాడు. వచ్చిన దగ్గర నుంచి మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కో సారి ఒక్కో కారణం చెబుతూ వచ్చాడు. అతను త్వరలోనే యూఏఈకి తిరిగి వెళ్తాడని.. సీఎస్కే జట్టుతో కలుస్తాడనే వార్తలు వస్తున్నాయి. అయితే బీసీసీఐ (BCCI) మాత్రం అతడు తిరిగి రావడానికి అంత సుముఖంగా లేనట్లు తెలుస్తున్నది.

‘అసలు చెన్నై జట్టులో ఏమి జరిగిందో బీసీసీఐ తెలుసుకోవాలని అనుకుంటున్నది. ధోనితో అతడికి విభేదాలు ఉంటే అది సీఎస్కే (CSK) అంతర్గత వ్యవహారం అవుతుంది. అలా కాకుండా అతడు కోవిడ్ 19 కారణంగా ఒత్తిడికి గురై ఉంటే అది మానసిక సమస్య అవుతుంది. ఒక వేళ అతడు మానసికంగా కుంగిపోయి ఉంటే తిరిగి ఐపీఎల్ రావడం మంచిది కాదు. అతడి వల్ల ఇతరులు తప్పక ఇబ్బంది పడతారు’ అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

మొదట్లో బయోబబుల్‌లో కూడా కొవిడ్ వచ్చింది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాకు ఫ్యామిలీనే ముఖ్యమని రైనా వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలని, మరోసారి సరైన రూమ్ ఇవ్వలేదని మాట మారుస్తూ వస్తున్నాడు. అతడి వ్యాఖ్యలు బీసీసీఐని అవమానపరిచేలా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో అతడు తిరిగి రావాలంటే బీసీసీఐ అనుమతి తప్పనిసరి అని అంటున్నారు.


Next Story

Most Viewed