- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డొనేషన్స్ కావాలి.. యూజర్లకు వికీపీడియా విజ్ఞప్తి
దిశ, వెబ్‌డెస్క్ : ఇంటర్నెట్ గురించి అవగాహన ఉన్న వారికి వికీపీడియా గురించి పరిచయం అక్కర్లేదు. 2001లో మొదటి సారిగా ఆన్‌లైన్‌లోకి ప్రవేశించిన వికీపీడియా ఈ రోజు డిజిటల్ సమాచారాన్ని అందించే ఓ లైబ్రరీగా మారిపోయింది. అనేక అంశాలపై విజ్ఞానాన్ని నెటిజన్లకు అందిస్తూ ఒక ప్రత్యేకమైన ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. అయితే అలాంటి వికీపీడియాను ఓపెన్ చేస్తున్న భారతీయులకు ఇప్పుడు ఓ మెసేజ్ అయోమయానికి గురి చేస్తోంది. వికీపీడియా పేజీలో ప్రస్తుతం ఓ బ్యానర్ కనిపించడం పాఠకులను కన్ఫ్యూజన్‌కు గురి చేస్తోంది. అయితే వికీపీడియా కొనసాగాలంటే దయచేసి డొనేషన్లు ఇవ్వాలని కోరడం ఆశ్చర్యానికి గురి చేసింది.
భారత యూజర్లకు విజ్ఞప్తి
నిజానికి వికీపీడియా అనే వెబ్ సైట్ తన మాతృ సంస్థ వికీమీడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఇది నాన్ ఫ్రాపిట్ ఫ్లాట్ ఫామ్ కావడం చేత ఆ సంస్థకు పని చేస్తున్న ఉద్యోగులకు, సాంకేతిక మార్పులకు డబ్బు అవసరం ఏర్పడుతుంది. ఈ మొత్తాన్ని వికీమీడియా డొనేషన్ల రూపంలోనే సేకరిస్తోంది. తాజాగా భారతీయులను వికీమీడియా అదేరీతిలో డొనేషన్లను కోరుతూ సందేశాలను పంపుతోంది. వికీపీడియా సందేశంలో ఏముందంటే.. 'భారతదేశంలోని మా పాఠకులందరికీ విన్నపం.. మా పాఠకులలో 98% మంది విరాళాలు ఇవ్వరు, వారంతా కేవలం మా సమాచారాన్ని చదువుతూనే ఉంటారు. కానీ మీరు రూ.50 విరాళం ఇవ్వడం ద్వారా వికీపీడియా మరి కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మీలో ఎవరైనా ఇదివరకే డొనేషన్ చేసి ఉంటే ధన్యవాదాలు' అని పేర్కొంది.
గతంలోనూ డొనేషన్ల స్వీకరణ
ఇదిలా ఉంటే వికీపీడియా వెబ్ సైట్‌లో అనేక మంది కార్పొరేట్ కంట్రిబ్యూటర్లు కూడా ఉన్నారు. గతంలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వికీమీడియా ఫౌండేషన్‌కు 1 మిలియన్ డాలర్ల విరాళం అందజేసింది. వికీపీడియా వెబ్‌సైట్ దాదాపు 250 మంది ఉద్యోగులు, 250,000 మంది గ్లోబల్ వాలంటీర్ల బృందంతో నిర్వహించబడుతోంది. 20 సంవత్సరాలలో వికీపీడియా దాదాపు 300 భాషలలో 50 మిలియన్లకు పైగా వ్యాసాలను సేకరించింది. విరాళాలు దాని సిబ్బందికి జీతాలు చెల్లించడంలో సహాయపడుతుండగా, వాలంటీర్లు తమ సేవలను వెబ్‌సైట్‌కి ఉచితంగా అందజేస్తారు. అయితే వెట్ సైట్ నిర్వహణ నిమిత్తం తాజాగా డొనేషన్లను స్వీకరిస్తోంది.