రాత్రంతా భర్త శవంతో భార్య.. ఛీ ఛీ.. ఇంత పాడుపనా..?

by Sumithra |
రాత్రంతా భర్త శవంతో భార్య.. ఛీ ఛీ.. ఇంత పాడుపనా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నించాడని ప్రియుడితో కలిసి భర్తను చంపేసిందో ఇల్లాలు. పొద్దంతా కష్టపడి భార్య పిల్లలను పోషిస్తున్న భర్తను కనికరం లేకుండా కడతేర్చింది. ఈ ఘటనను కల్లారా చూసిన కొడుకును కూడా చంపేస్తానని బెదిరించింది. ఈ అవమానీయ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.

మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన కూరపాటి అనిల్‌కు పదేళ్ల క్రితం అరుణతో వివాహమైంది. వారికి ముగ్గురు కుమారులు. అనిల్ దినసరి కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటిపట్టునే ఉండే అరుణకు గ్రామానికి చెందిన ఆడెపు రాంబాబుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. గత కొంతకాలంగా గుట్టుగా సాగుతున్న వారి వ్యవహారం ఈనెల 8న బయటపడింది. భర్త అనిల్ పనికిపోయి ఇంటికి వచ్చే సరికి భార్య.. రాంబాబు ఏకాంతంగా గడపడాన్ని చూసి ఆమెను మందలించి, ఘర్షణ పడ్డాడు. ఆ తర్వాత ఇంట్లోనే నిద్రపోయాడు.

తనను ఎంజాయ్ చేయకుండా అడ్డుకున్న భర్తపై అరుణ కోపం పెంచుకుంది. అతడు బతికి ఉంటే తన ఆటలు సాగవని అదే రోజు రాత్రి ప్రియుడు రాంబాబుని పిలిచి భర్తను హత్య చేయాలని కోరింది. ఇంట్లో వారందరు నిద్రలో ఉండగా ఇంట్లోకి వచ్చిన రాంబాబు.. అనిల్ ను చద్దర్ తో ఊపిరి ఆడకుండా అదిమిపట్టగా.. భార్య అరుణ భర్త మర్మంగాలను నులిపి హత్య చేసింది. రాత్రంతా భర్త శవంతోనే పడుకోని తెల్లారి ఏం తెలియనట్టే ఇంటిపనుల్లో నిమగ్నమైంది. పొద్దెక్కిన అనిల్ లేవకపోవడంతో తల్లి వచ్చి నిద్ర లేపడానికి ప్రయత్నించింది. అయినా లేవకపోవడంతో అనుమానం వచ్చి పరిశీలించగా.. అప్పటికే మృతి చెంది ఉన్నాడు.

కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు అనుమానం రాకుండా భర్త అప్పుల బాధతో నిద్రమాత్రలు మింగి చనిపోయాడని ఏడుస్తూ అందరిని నమ్మించింది. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించింది. కథ సుఖాంతం అయింది అనుకునే సమయంలో పెద్ద కుమారుడు బాంబ్ పేల్చాడు. రాత్రి సమయంలో నాన్నను నువ్వే చంపావని, ఈ విషయం అందరికి చెబుతానని చెప్పడంతో బాలుడిని బెదిరించింది. బయట ఎవరికి చెప్పినా మీ నాన్నను చంపినట్టే నిన్ను కూడా చంపేస్తానని హెచ్చరించింది. అప్పటి నుంచి బాలుడిని ఎవరు కలవకుండా, ఒంటరిగా వదలకుండా జాగ్రత్త పడింది. ఈనెల 25న అరుణ మునుగోడుకు వెళ్లడంతో విషయం మొత్తం అనిల్ తల్లిదండ్రులకు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు అరుణను అరెస్ట్ చేశారు. ప్రియుడు రాంబాబు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ రజినీకర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed