- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెట్ల పొదల్లో అలా చేసిన ప్రియుడు.. విషయం బావకు చెప్పిన భర్త
దిశ, లింగాల: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్తను ప్రియుడు చంపే ప్రయత్నం చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పరిదిలోని దేవునిపల్లి గ్రామనికి చెందిన ఓ మహిళతో వట్టిపల్లి గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియురాలి భర్తను చంపే ప్రయత్నం చేశాడు ప్రియుడు. పథకం ప్రకారం గురువారం సాయంత్రం ప్రియురాలి భర్తను తన బైక్ పై తీసుకెళ్లి లింగాల మండల పరిధిలోని అంబటిపల్లికి వెళ్లే దారిలో ( కేసీ తండాకు పోయే దారి దగ్గర) తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్ తో అతని తలపై శివ బలంగా కొట్టి పరారయ్యాడు. దీంతో అతడికి తీవ్ర గాయలయ్యాయి. తీవ్ర గాయాలతో అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిన భర్త జరిగినదంతా తన బావ వంగూరి బొందయ్యకు చెప్పాడు. దీంతో బొందయ్య లింగాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపాడు.