భర్తపై కిరాతకంగా దాడి చేసిన భార్య

దిశ, రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ భార్య భర్తపై అతి కిరాతకంగా కత్తి దాడి చేసింది. ఈ దాడిలో భార్తకు తీవ్ర గాయాలు కావడంతో మృతిచెందాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… ఉత్తరఖాండ్‌కు చెందిన విశాల్(32), అదే రాష్ట్రానికి చెందిన సబీనా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ కూడా రెండో వివాహమే కావడం గమనార్హం. వీరు బండ్లగూడ జాగీర్ పరిధి సన్‌సిటీలోని మాపిల్‌టౌన్ విల్లాస్‌లో నివాసముంటున్నారు. సబీనా వైద్యురాలిగా పనిచేస్తుండగా, విశాల్ ఓ ప్రయివేటు సెక్యూరిటీ ఏజెంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. కాగా రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం మాటా మాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సబీనా… కత్తితో విశాల్ గుండె భాగంలో పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. దీంతో విషయం తెలిసిన రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, సబీనాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Advertisement