భర్త బౌలింగ్.. భార్య కీపింగ్

by  |
భర్త బౌలింగ్.. భార్య కీపింగ్
X

దిశ, స్పోర్ట్స్: భర్త బౌలింగ్ చేస్తుంటే భార్య కీపింగ్ చేయడం ఎక్కడైనా చూశారా? ఇదేదో గల్లీ క్రికెట్ లేదా సరదాగా ఆడుతున్న ఫ్యామిలీ మ్యాచ్ కాదు. అచ్చమైనా ప్రొఫెషనల్ క్రికెట్. కరోనా నేపథ్యంలో క్రికెట్ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో తిరిగి ఆటను ప్రారంభించాలనే ఉద్దేశంలో స్విట్జర్లాండ్ వేదికగా యూరోపిన్ క్రికెట్ సిరీస్ (ఈసీఎస్) టీ10 లీగ్ ప్రారంభించారు. ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లు చాలా వరకు జరిగిపోయాయి. శుక్రవారం సెమీస్, ఫైనల్స్ జరుగనున్నాయి. అయితే, ఈ లీగ్‌లో కేఎస్‌వీ క్రికెట్ టీం తరఫున భార్య, భర్తలు ఆడుతున్నారు. భర్త ఫిన్ సదరంగని, భార్య శరణ్య సదరంగని సెమీస్‌లో కలసి ఆడటం క్రికెట్‌లో అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. భర్త బౌలింగ్ చేస్తుండగా భార్య కీపింగ్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నది. కర్ణాటక అండర్ – 19 జట్టు ప్లేయర్ అయిన శరణ్య సదరంగ తర్వాత స్విట్జర్లాండ్‌లో స్థిరపడింది. ఫిన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఫిన్ తన భార్య ఇంటి పేరునే తన సర్‌నేమ్‌గా మార్చుకోవడం విశేషం.


Next Story

Most Viewed