- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్తకు కరోనా.. పిల్లలతో కలిసి భార్య ఘాతుకం
దిశ, వెబ్‌డెస్క్ : భర్తకు కరోనా సోకిందని కలత చెందిన ఓ ఇల్లాలు తీవ్ర నిర్ణయం తీసుకుంది. భర్తను ఐసోలేషన్‌లో ఉంచి తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఖమ్మం నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికుల సమాచారం ప్రకారం..
ఖమ్మం రేవతి సెంటర్ పార్క్ వద్ద ధోనువాన్ శ్రీనివాస్, భార్య వనిత (30), పిల్లలు చైతన్య(10), హరిత (7)ల తో కలిసి జీవిస్తున్నాడు. ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్న శ్రీనివాస్ కు నెల రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో భర్తను ఇంట్లోనే ఉంచి భార్య పిల్లలతో కలిసి ఖమ్మంలోనే యూపీహెచ్ కాలనీలో నివాసం ఉంటున్న తన తల్లిగారి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి అక్కడే ఉంటున్న వనిత బుధవారం ఉదయం ఇంట్లో నుంచి పిల్లలతో కలిసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
మధ్యాహ్నం అయినా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి వారి ఆచూకీ కోసం వెతకగా.. కాల్వఒడ్డు వద్ద మున్నేరులో తల్లి, ఇద్దరు పిల్లలు శవాలుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్తకు కరోనా సోకిందని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని కలత చెందిన వనిత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.