- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీకిపీడియా విరాళాలు కోరుతోంది
దిశ, వెబ్‌డెస్క్ : ‘వీకిపీడియా.. ద ఫ్రీ ఎన్‌సైక్లోపీడియా’ గురించి తెలియని నెటిజన్ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. వాలంటీర్ ఎడిటర్ల సాయంతో అందరికీ ఉచితంగా విజ్ఞానాన్ని అందిస్తోంది. దాదాపు అన్ని భాషలకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ పొందవచ్చు. వరల్డ్ వైడ్ వెబ్‌లో మోస్ట్ పాపులర్, లార్జెస్ట్ జనరల్ రెఫరెన్స్ ఎన్‌సైక్లోపీడియా ఇదే కావడం విశేషం. ఇందులో ఎటువంటి యాడ్స్ కనిపించవు. ఏ ఇన్‌ఫర్మేషన్ అయినా ఇక్కడ ఉచితంగా పొందవచ్చు. లైబ్రరీకి వెళ్లినా.. ఎంతోకొంత నామినల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇందులో ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ‘వీకిమీడియా ఫౌండేషన్’ నిర్వహిస్తోంది. అయితే ఈ సంస్థ ఇప్పుడు విరాళాలు కోరుతుండటం గమనార్హం.
వీకిపీడియాను 2001, జనవరి 15న లాంచ్ చేశారు. జిమ్మీ వేల్స్, ల్యారీ సాంగర్ అనే ఇద్దరు వ్యక్తులు దీన్ని ప్రారంభించారు. పలు భాషలకు చెందిన 54 మిలియన్ల ఆర్టికల్స్ వీకిపీడియా సొంతం. ప్రతి నెల వీకిపీడియాకు 1.5 బిలియన్ల యూనిక్ విజిటర్స్ వస్తుంటారు. అయితే, ఇది కమర్షియల్‌గా డబ్బులు సంపాదించడం కోసం పెట్టిన వెబ్‌సైట్ కాదు. నెటిజన్లకు విజ్ఞానాన్ని అందించడానికి మాత్రమే దీన్ని స్టార్ట్ చేశారు. అయితే తమ సబ్ ఎడిటర్ల కోసం వీకిపీడియాను మరింత ముందుకు తీసుకుపోవడానికి విరాళాలు అడుగుతోంది. ఈ క్రమంలో ‘నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సహకారంతో వీకిపీడియా రన్ చేస్తున్నాం. మాకు ఎలాంటి యాడ్ రెవిన్యూ ఉండదు. మాకు ఎలాంటి షేర్ హోల్డర్స్ కూడా లేరు. మాకు ఉన్నది స్వచ్ఛంద డోనార్స్ మాత్రమే. మేము ఇప్పటికీ ఇక్కడ ఉన్నామంటే.. మా రీడర్స్ అందిస్తున్న విరాళాలే వల్లే. వీకిపీడియా స్వాతంత్య్రాన్ని ఇలానే ఉంచేందుకు మీ సాయం కోరుతున్నాం. వీకిపీడియాను వాడుతున్న 98 శాతం మంది విరాళాలను ఇవ్వడం లేదు. మీరు రూ.150లు విరాళం ఇచ్చినట్లయితే, వీకిపీడియా సేవలు నిరంతరంగా కొనసాగుతాయి. వీకిపీడియా వలన చాలా మంది తెలియని విషయాలు తెలుసుకుంటున్నారు. అందుకే కొంతమంది విరాళాలు ఇస్తున్నారు. మీరు కూడా దయచేసి విరాళం ఇవ్వండి. మీ కోసం కచ్చితమైన సమాచారాన్ని ఇస్తోన్న వాలంటీర్ల కోసం సాయం చేయండి’ అని వీకిపీడియా అడుగుతోంది.