టాలీవుడ్‌కు సత్తా ఉన్నా.. పక్క చూపులెందుకు..?

by Anukaran |   ( Updated:2020-12-09 07:04:07.0  )
టాలీవుడ్‌కు సత్తా ఉన్నా.. పక్క చూపులెందుకు..?
X

దిశ, వెబ్‌డెస్క్ : నాలుగు దశాబ్ధాల క్రితం వరకు తెలుగు చిత్ర సీమకు డబ్బింగ్ చిత్రాలంటే తెలియదు. సొంత కథలతోనే సినిమాలను తెరకెక్కించేవారు. విజయాల శాతం కూడా ఎక్కువగానే ఉండేది. 1960-70 మధ్య కాలం నుంచి తెలుగు సీత్రసీమ కొత్త ఫార్ములాను ప్రారంభించింది. తమిళ, హిందీ, మళయాలం భాషల్లో హిట్ అయినా చిత్రాలను రీమేక్‌లు చేస్తున్నారు. 1990 నుంచి రీమేక్ సినిమాల హడావిడి బాగా ఎక్కువైంది. మిగతా సినిమా ఇండస్ట్రీలలో సూపర్ హిట్ సినిమాల మేకర్స్ వెంట పడి రీమేక్ రైట్స్ తెచ్చుకుంటున్నారు. అలా ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కూడా రీమేకే. ఈ మూవీ హిందీ, తమిళ్ లో సూపర్ హిట్. మళ్లీ తెలుగులో చూస్తారా అంటే.. పవన్ కళ్యాణ్ కదా చూస్తారన్న నమ్మకం ఇండస్ట్రీది.

పవన్ కళ్యాణ్ నుంచి సత్యదేవ్ వరకు..

తమిళంలో హీరో ధనుష్ నటించిన చిత్రం ‘అసురన్’. అక్కడ రూ.100 కోట్ల పైనే వసూళ్లు రాబట్టింది. అందుకే ఆ సినిమాని విక్టరీ వెంకటేష్ తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్నారు. మలయాళ హిట్ సినిమా ‘లూసిఫర్’… తమిళ్ హిట్ ‘వేదలమ్’ ఈ రెండు సినిమాల రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. ఇక చిన్న హీరో సత్యదేవ్-స్టార్ హీరోయిన్ తమన్నా .. నటిస్తున్న చిత్రం ‘గుర్తుందిగా శీతాకాలం’. ఒక కన్నడ చిత్రానికి ఇది రీమేక్. ఇవే కాదు మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ‘కప్పెల’ ‘హెలెన్’ ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఇవన్నీ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్. వాటాన్నీటి హక్కులను టాలీవుడ్ టక్కున కొనేసుకుంది.

సత్తా ఉన్నా.. అవకాశాలేవీ..?

తెలుగులో దమ్మున్న రైటర్స్ లేరా.. అంటే పుష్కలంగా ఉన్నారు. ఎంతో మంది సత్తా ఉన్న లోకల్ అప్ కమింగ్ రైటర్స్, డైరెక్టర్స్ ఉన్నారు. దానికి ఉదాహరణ రన్ రాజా రన్ ఫేం సుజీతే. ఆయన అంతకు ముందు షార్ట్ ఫిలింస్ చేశాడంతే. కానీ అతడిని నమ్మి ప్రభాస్ అవకాశం ఇవ్వడంతో సాహో అన్న పాన్ ఇండియన్ సినిమా తీశాడు. అవకాశం ఇవ్వడానికి అందరూ ప్రభాస్‌లా ఆలోచించాలి. అలా జరగకనే ఈ రీమేకులు.

ఇదే మంచి తరుణం..

ప్రస్తుతం క్రైసిస్ సమయంలో కోట్లు ఖర్చు పెట్టి పరభాషా చిత్రాలను రీమేక్ చేయడం కంటే లోకల్ టాలెంట్ ని గుర్తించి ఇండస్ట్రీకి కొత్తవారిని పరిచయం చేస్తే చాలా మందికి లైఫ్ ఉంటుందన్న సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఇందులో వందకి వంద శాతం నిజం ఉంది. ఇదే జరిగితే టాలీవుడ్ లో కూడా పెళ్ళి చూపులు, కేరాఫ్ కంచెర పాలేం లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తాయి. అప్పుడు పక్క ఇండస్ట్రీ వారు మన సినిమాలు రీమేక్ చేయడానికి పోటీ పడతారు. మన తెలుగు ఇండస్ట్రీనే అందరికంటే ముందుంటుంది. పాన్ ఇండియా సినిమాలు తీస్తూ దేశవ్యాప్తంగా మన మార్కెట్ విస్తరించాలనుకోవడం మంచిదే.. అలానే లోకల్ టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేయాలి కదా..

Advertisement

Next Story

Most Viewed