- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘అప్పటినుంచే చావుతో పోరాటం’
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad) వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆడక పోయినా, మిగిలిన రెండు మ్యాచ్‌లు ఆడి ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (Player of the Series)గా నిలిచాడు. అదే సిరీస్‌లో 500వికెట్లు తీసి అరుదైన క్లబ్ (Club)లో చేరాడు. తాజాగా, గురువారం నుంచి సౌతాంప్టన్‌లో పాకిస్తాన్ జట్టుతో ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజు మైదానంలో ఇబ్బందిగా కదులుతున్నట్లు కనపడ్డాడు.
బౌలింగ్ చేసే సమయంలో ఇన్‌హేలర్ (Inhaler) సహాయంతో శ్వాస తీసుకున్నాడు. ఒక ఫాస్ట్ బౌలర్ (Fast bowler) ఇలా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడటాన్ని టీవీల్లో చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపడ్డారు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ (International level cricketer)కు ఆస్తమా ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే, అది నిజమే. బ్రాడ్ ఎంతోకాలంగా ఆస్తమా (Asthma)తో బాధపడుతున్నాడు. 2015లో యాషెస్ ఆడే సమయంలో బ్రాడ్ స్వయంగా ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. దీనిపై బ్రాడ్ వివరణ ఇస్తూ.. ‘నేను నెలలు నిండకముందే పుట్టడంతో ఒకటిన్నర లంగ్స్ మాత్రమే అభివృద్ధి చెందాయి. అప్పటి నుంచే ఆస్తమా (Asthma)తో బాధపడుతున్నాను. అందుకే ఈ ఇన్‌హేలర్ (Inhaler)ఉపయోగిస్తుంటాను. నా పుట్టుకే చావుతో ఆరంభమైంది. నా కెరీర్ మొత్తం సగం లంగ్స్ (Half Lungs)తోనే సాగింది. అలాగే నేను 500 వికెట్లు తీశాను. ఇది నాకు కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది’ అని బ్రాడ్ అన్నాడు.