‘టెస్టుల్లో రోహిత్ విఫలానికి కారణమిదే’

by Shiva |
‘టెస్టుల్లో రోహిత్ విఫలానికి కారణమిదే’
X

దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు వన్డే, టీ20ల్లో ఎలాంటి రికార్డు ఉందో అందరికీ తెలిసిందే. సెంచరీలు బాదడం, బంతిని బౌండరీకి తరలించడం రోహిత్‌కు వెన్నతో పెట్టిన విద్య. కానీ అదే రోహిత్, టెస్ట్ మ్యాచ్‌ల దగ్గరకొచ్చే సరికి చతికిల పడ్డాడు. గొప్ప టెస్ట్ ప్లేయర్ అనిపించుకోవడంలో ఇప్పటికీ విఫలమవుతున్నాడు. దీనిపై తాజాగా, ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ గ్రోవర్ స్పందించాడు. ‘రోహిత్‌లాంటి ఆటగాళ్లను తాను చాలా మందిని చూశాను. ఇంగ్లాండ్ జట్టులో జేసన్ రాయ్ అలాంటి ఆటగాడే. వన్డే వరల్డ్ కప్‌లో ఎంతో అద్భుతంగా రాణించాడు. కానీ, యాషెస్‌కు వచ్చే సరికి పూర్తిగా విఫలమయ్యాడు. రోహిత్, రాయ్‌లాంటి ఆటగాళ్లు వన్డే, టీ20లు ఆడినంత స్వేచ్ఛగా టెస్టులు ఆడలేదు. టెస్ట్ మ్యాచ్‌లలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అందరూ ఎదుర్కోలేరు. వన్డే, టీ20 మ్యాచ్‌లలో అలాంటి సవాళ్లు ఏవీ ఉండవు. ఇదే వారు టెస్టుల్లో విఫలమవడానికి కారణం’ అని చెప్పుకొచ్చాడు. ఆటగాడి అసలైన ప్రతిభ టెస్టు క్రికెట్‌లోనే బయటపడుతుందని అంటారని, టెస్ట్ క్రికెట్‌ను క్రికెట్‌ పెద్దన్నగా చెప్పడానికి ఇదే కారణమని గ్రోవర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed