‘రాజాసింగ్ ను బీఏసీ సమావేశానికి ఎందుకు ఆహ్వానించరు’

by Shyam |   ( Updated:2021-09-24 08:19:33.0  )
‘రాజాసింగ్ ను బీఏసీ సమావేశానికి ఎందుకు ఆహ్వానించరు’
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే , బీజేపీ ఫ్లోర్ లీడర్ టీ రాజాసింగ్ ను శుక్రవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి ఆహ్వానించకపోవడాన్ని ఆ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన (చీఫ్ స్పోక్స్ పర్సన్) కె కృష్ణ సాగర్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజాసింగ్ ను బీఏసీ సమావేశానికి ఆహ్వానించకపోవడం అప్రజాస్వామిక చర్య అన్నారు. సీఎం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి తీరును బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అసెంబ్లీ నియమాలు, పద్ధతులు పాటించకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, కేసీఆర్ తన కుటుంబాన్ని నడిపినట్లుగా రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారని, ఇది ఎంతోకాలం సాగదన్నారు. ఆయన తీరు అప్రజాస్వామిక, ఏకపక్ష నిర్ణయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story