- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాన్వీ కెరీర్ ఫెయిల్‌కు కారణం ఇదేనా..?
దిశ, సినిమా : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తొలి సినిమా ‘దఢక్’తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో యాక్టింగ్‌కు ఫిదా అయిన ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు.. జాన్వీ రెండో సినిమాకే స్టార్ రేంజ్ సొంతం చేసుకుంటుందని అనుకున్నారు. కానీ బ్యాడ్ లక్.. ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’, ‘రూహి’ చిత్రాలు డిజాస్టర్ కావడంతో చాన్స్‌లు కూడా కరువయ్యాయని టాక్. కరణ్ జోహార్ సపోర్ట్, తండ్రి బోనీ కపూర్ ఎంకరేజ్మెంట్ ఉన్నా సరే జాన్వీకి అవకాశాలు మాత్రం రావడం లేదు. అటు నార్త్‌లో మాత్రమే కాదు ఇటు సౌత్‌లోనూ ఫిల్మ్ మేకర్స్ తనను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.
అయితే దీనికి కారణం.. జాన్వీ మార్కెటింగ్ టీమ్ అని తెలుస్తోంది. ఏదైనా అవకాశం వెతుక్కుంటూ వస్తే రూ.4కోట్లకు పైగా రెమ్యునరేషన్ అడుగుతుండటంతో మేకర్స్ ఇంట్రెస్ట్ చూపడం లేదని టాక్. అసలు టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా ప్రూవ్ చేసుకోలేని జాన్వీ.. స్టార్ కిడ్స్‌గా ఎంటర్ అయిన కరీనా కపూర్, ఆలియా భట్ మాదిరిగా ప్రూవ్ చేసుకుంటే మంచిదని, ఆ తర్వాత పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ల వేటలో పడితే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకానీ ఎలాంటి ప్రయత్నాలు లేకుండా పాన్ ఇండియా లెవల్‌లో ప్రయత్నిస్తే ప్రయోజనం ఉండదని చెప్తున్నారు.