పాపులర్ ‘ధీరే ధీరే సే’ సాంగ్ హృతిక్ అందుకే చేశాడట!

by Jakkula Samataha |
పాపులర్ ‘ధీరే ధీరే సే’ సాంగ్ హృతిక్ అందుకే చేశాడట!
X

దిశ, సినిమా : హృతిక్ రోషన్, సోనమ్ కపూర్ కలిసి చేసిన మ్యూజిక్ ఆల్బమ్ ‘ధీరే ధీరే సే’ సూపర్ హిట్ అయింది. యో యో హనీ సింగ్ మ్యూజిక్ అందించిన వీడియో ఆల్బమ్‌ను భూషణ్ కుమార్ ప్రొడ్యూస్ చేశాడు. అయితే హృతిక్ అసలు ఇందులో ఎందుకు నటించాల్సి వచ్చిందనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించాడు భూషణ్ కుమార్. గతంలో కొన్ని ప్లాట్‌ఫామ్స్ నాన్ ఫిల్మ్ మ్యూజిక్‌ను తీసుకునేందుకు ఇష్టపడలేదని, వెల్ నోన్ ఫేసెస్‌తో ఉన్న వీడియోలకు మాత్రమే చాన్స్ ఇచ్చేవని తెలిపాడు. సాంగ్‌ను సాంగ్‌లా చూడాలని ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్న తను..నాన్ ఫిల్మ్ మ్యూజిక్ కోసం మార్కెట్ ప్రారంభించాలని అనుకున్నానని, తద్వారా సింగర్స్‌ను పాపులర్ చేసేందుకు ప్రయత్నించానని చెప్పాడు.

ఈ క్రమంలో సింగర్స్ వాయిస్‌ తీసుకుని యాక్టర్స్‌తో కలిపేసేవాడినని తెలిపాడు భూషణ్ కుమార్. ఆ సమయంలో హృతిక్, యో యో హనీ సింగ్ పాట చేశానని..కానీ హనీ సింగ్ హెల్త్ బాగా లేకపోవడంతో ఈ వీడియోలో హృతిక్‌ను నటించాలని కోరినట్లు చెప్పాడు. పాట బాగుండటంతో తను ఈజీగా యాక్సెప్ట్ చేశాడని తెలిపాడు. కాగా ఈ సాంగ్‌ను ఇతర ప్లాట్ ఫామ్స్‌కు కూడా ఇచ్చామని, హ్యాపీగా యాక్సెప్ట్ చేశాయని చెప్పాడు. ఆ తర్వాత ఇమ్రాన్ హష్మి, టైగర్ ష్రాఫ్‌లతో నాన్ ఫిల్మ్ మ్యూజిక్ కంటిన్యూ చేసినట్లు వెల్లడించాడు భూషణ్.

Advertisement

Next Story