బ్యాటింగ్ జడేజా.. బౌలింగ్ చాహల్

by Shyam |
బ్యాటింగ్ జడేజా.. బౌలింగ్ చాహల్
X

దిశ, స్పోర్ట్స్: డెట్టాల్ టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ మైదానంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కేవలం 23 బంతుల్లోనే 44 పరుగుులు చేసి భారత జట్టును ఆదుకున్నాడు. అయితే బౌలింగ్ చేసే సమయంలో మాత్రం అతడి బదులు చాహల్ బరిలోకి దిగారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అసలు విషయం ఏంటంటే.. అంతర్జాతీయ మ్యాచ్‌ జరిగే సమయంలో ఎవరైనా ఆటగాడు గాయపడితే.. అతడి బదులు వేరే ఆటగాడిని జట్టులోకి తీసుకోవచ్చు.

కేవలం సబ్‌స్టిట్యూట్‌గా కాకుండా పూర్తి స్థాయి ఆటగాడిగా బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేయవచ్చు. రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేసే సమయంలో మిచెల్ స్టార్క్ వేసిన చివరి ఓవర్లో గాయపడ్డాడు. స్టార్క్ వేసిన షార్ట్ పిచ్ బంతి జడేజా హెల్మెట్‌కు బలంగా తగిలింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగలేదు. అతడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా చాహల్‌ను బరిలోకి దింపారు. అయితే ఈ నిర్ణయంపై ఆస్ట్రేలియా జట్టు అభ్యంతరం వ్యక్తం చేసినా.. మ్యాచ్ రిఫరీ మాత్రం చాహల్‌కు అనుమతి ఇచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed