- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వార్నర్ స్థానంలో జేసన్ రాయ్?
దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను తప్పించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాగా, వార్నర్ కెప్టెన్‌గా ఉండటం వల్ల అతడు విఫలమవుతున్నా ప్రతీ మ్యాచ్‌లో కొనసాగించాల్సి వస్తున్నదని యాజమాన్యం అభిప్రాయపడుతున్నది. మరో విదేశీ ప్లేయర్‌కు చోటివ్వాలంటే విఫలమవుతున్న వార్నర్‌ను తప్పించడం తప్ప మరో ఆప్షన్ కనిపించల లేదు. అందుకే సన్‌రైజర్స్ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ఆశించిన మేరకు రాణించలేదు.
దీంతో జానీ బెయిర్‌స్టోకు సొంత జట్టులో పార్ట్‌నర్ అయిన జేసన్ రాయ్‌కి చోటు కల్పించాలని యాజమాన్యం భావిస్తున్నది. ఇటీవల ఇండియాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో జానీ బెయిర్‌స్టో, జేసన్ రాయ్ కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది. రాయ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఓపెనింగ్ జోడీగా వారిని పంపాలని భావిస్తున్నది. ఒక వేళ రాయ్‌ని తీసుకోకుండా జానీకి సాహాను తోడుగా పంపితే.. ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌కు తుది జట్టులో స్థానం లభించవచ్చు. ఏదేమైనా వార్నర్‌ను తప్పించడం పట్ల హైదరాబాద్ అభిమానుల్లో మిశ్రమ స్పందన లభిస్తున్నది.