సందీప్ కిషన్ హీరో తనేనా?

by Jakkula Samataha |
సందీప్ కిషన్ హీరో తనేనా?
X

యంగ్ హీరో సందీప్ కిషన్.. కథానాయకుడిగానే కాదు నిర్మాతగానూ రాణిస్తున్నాడు. ఈ మేరకు సోమవారం నిర్మాతగా మరో కొత్త సినిమా ప్రకటించాడు సందీప్. రామ్ అబ్బరాజ్ డైరెక్షన్‌లో ‘వివాహ భోజనంబు’ సినిమాను అనౌన్స్ చేశాడు. వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ సంయుక్త నిర్మాణంలో వస్తున్న సినిమా ద్వారా తన ఫేవరెట్ యాక్టర్‌ను హీరోగా పరిచయం చేయబోతున్నట్లు ప్రకటిస్తూ.. వివాహ భోజనంబు ప్రీ లుక్ రిలీజ్ చేశాడు సందీప్ కిషన్.

కాగా, ఈ యాక్టర్ ఎవరనే దానిపై ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో చర్చ జరుగుతోంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్‌టైన్మెంట్‌లో కమెడియన్ సత్య లీడ్ రోల్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇది ఇంకా కన్‌ఫర్మ్ కాకపోయినా 99.9% తానే అనేది ఇండస్ట్రీ టాక్. ప్రీ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉండగా.. అసలు స్టోరీ లైన్ ఏమై ఉంటుందనే ఎగ్జైట్‌మెంట్ ఆడియన్స్‌లో మొదలైంది. ‘స్వామి రారా, గద్దలకొండ గణేష్’తో పాటు పలు చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు చేసిన సత్యకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

Advertisement

Next Story