ఇంతకీ దిశ రవి ఎవరు? ఆమె గురించి ఆసక్తికర విషయాలు

by Shamantha N |   ( Updated:2021-02-15 10:09:02.0  )
ఇంతకీ దిశ రవి ఎవరు? ఆమె గురించి ఆసక్తికర విషయాలు
X

దిశ,వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ అంశం దేశాన్ని కుదిపేస్తుంది… అదే టూల్ కిట్. ఆ టూల్ కిట్ అంటే ఏంటీ? దిశ రవి ఎవరూ? గ్రేటా థన్‌బర్గ్ ఎవరూ? అనే ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టూల్ కిట్ అంటే?

దేశంలో ఏదైనా సమస్యను పరిష్కరించేలా పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరలేపేందుకు ఉపయోగించే కోడ్‌ను టూల్ కిట్ అంటారు. టూల్ కిట్ ఆధారంగా ప్రభుత్వాల్ని ఇరుకున పెట్టేలా కార్యచరణ రూపొందిస్తారు. ఆ కార్యచరణ ఆధారంగా ఉద్యమాన్ని నిర్వహించి ప్రభుత్వాల పరిపాలనను నిర్వీర్యం చేస్తారు.

స్వీడన్ లో థన్ బర్గ్.. భారత్ లో దిశ రవి

టూల్ కిట్‌ను తొలిసారిగా స్వీడన్ కు చెందిన 18ఏళ్ల ఎన్విరాన్ మెంటల్ యాక్టివిస్ట్ ‘గ్రేటా థన్‌బర్గ్’ వినియోగించారు. 2019 సెప్టెంబర్‌లో జరిగిన UN ప్రతినిధుల సభలో అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ హితానికి చర్యలు చేపట్టాలని తనదైన వాయిస్ వినిపించి ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించారు. తాజాగా భారత్ లో జరిగిన రైతుల ఉద్యమానికి మద్దతు పలికిన థన్‌బర్గ్… టూల్ కిట్ అనే పదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొద్దిసేపటికే ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే భారత్ లో జరిగిన జనవరి 26 గణతంత్ర వేడుకల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ హింసాత్మక ఘటనలు టూల్ కిట్ ఆధారంగా జరిగినట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి భారత్ లో టూల్ కిట్ ఆధారంగా అల్లర్లకు కారణమైన క్లైమేట్ యాక్టివిస్ట్ దిశ రవిని ఆదివారం బెంగళూరులో సోలాదేవన హల్లి అనే ప్రాంతంలో అరెస్ట్ చేశారు.

ఇంతకీ ఈ “దిశ రవి” ఎవరు..?

భారత్ లో జనవరి 26 గణతంత్ర వేడుకల్లో జరిగిన హింసాత్మక ఘటనలకు బెంగళూరుకు చెందిన క్లైమేట్ యాక్టివిస్ట్ దిశ రవి పాత్ర ఉన్నట్టు అభియోగాలు వెలువడుతున్నాయి. ఢిల్లీలో హింసాత్మక అల్లర్లు జరిగేలా టూల్ కిట్ ను దిశ రవి షేర్ చేశారని, ఆ లింక్స్ మూలాలు ఖలిస్తాన్ వేర్పాటు వాదులకు చెందినవని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 22 ఏళ్ల దిశ ర‌వి బెంగ‌ళూరులోని మౌంట్ కామెల్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) డిగ్రీ పూర్తి చేసింది.

‘ఫ్రైడేస్ ఫ‌ర్ ఫ్యూచ‌ర్’ పేరుతో సోషల్ మీడియాలో గ్రూప్ లను హ్యాండిల్ చేస్తుంది. దీంతో పాటు పలు ప్రముఖ మీడియా సంస్థల్లో వాతావరణంలో మార్పుల గురించి కాలమ్స్ రాస్తోంది. సోషల్ మీడియాలో వాతావరణం గురించి నిర్వహించే క్యాంపెయినింగ్ లో యాక్టివ్ మెంబర్ గా ఉంది.

వాతావరణం గురించి ఎందుకు ఉద్యమం చేస్తోంది?

ఆటో రిపోర్ట్ ఆఫ్రికా -2020 పేరుతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో దిశ ర‌వి మన వాతావరణం ఉద్యమం గురించి ప్రస్తావించారు. మా నాన‌మ్మ‌, తాత‌లు రైతులు. వాళ్ల వ‌ల్లే అస‌లు ప‌ర్యావ‌ర‌ణ మార్పులు రైతుల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతున్నాయో తెలుసుకున్నాను. అప్పటి నుంచే రైతులు, వాతావరణంలో జరిగే మార్పులకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ‘ఫ్రైడే ఫర్ ఫ్యూచర్’ పేరుతో 2018లో స్వీడన్ కు చెందిన ఎన్విరాన్ మెంటల్ యాక్టివిస్ట్ ‘గ్రేటా థన్‌బర్గ్’ ఓ సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థకు చెందిన కార్యకలాపాలను భారత్ లో దిశ రవి నిర్వహిస్తున్నారు. ‘ఫ్రైడే ఫర్ ఫ్యూచర్’ క్యాంపెయినింగ్ లో భాగంగా పిల్లలు ప్రతీ శుక్రవారాల్లో తరగతులను బహిష్కరించి వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేయాలని పిలుపునిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed