- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌లో ఏ అవార్డు ఎవరికొచ్చింది?
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 13 అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సాగింది. తొలి నుంచి టగ్ ఆఫ్ వార్ మ్యాచులు ఎంతగానో అలరించాయి. అయితే, ఫైనల్స్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ పై విజయం సాధించింది. కానీ, సీజన్ అవార్డుల్లో మాత్రం ప్లే ఆఫ్స్ దశలోనే వెనుదిరిగిన జట్ల నుంచి కూడా ఆటగాళ్లు అవార్డులు అందుకున్నారు.
ముఖ్యంగా రాజస్తాన్ రాయల్స్ ఫేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆర్చర్ మాట్లాడుతూ.. ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. జట్టు కోసం వికెట్లు తీయడమే కాకుండా పరుగులు కూడా చేశాను. ఈ సీజన్ నాకు చాలా ప్రత్యేకం. ఇలాంటి అవార్డులు మరిన్ని అందుకోవాలని ఉన్నది. తనకు సహకరించిన జట్టు సభ్యులకు, యాజమాన్యానికి ధన్యవాదములు తెలిపాడు.
ఫైనల్ మ్యాచ్ అవార్డులు:
-
డ్రీమ్ ఎలెవెన్ గేమ్ చేంజర్ ఆఫ్ ది మ్యాచ్ – రోహిత్ శర్మ
-
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ – ఇషాన్ కిషన్
-
లెట్స్ క్రాక్ ఇట్ సిక్సెస్ అవార్డ్ – రోహిత్ శర్మ
-
పవర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ – ట్రెంట్ బౌల్ట్
-
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ – ట్రెంట్ బౌల్ట్
సీజన్ అవార్డులు
-
ఐపీఎల్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ – దేవ్‌దత్ పడిక్కల్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
-
పేటీఎం ఫెయిర్ ప్లే అవార్డు – ముంబయి ఇండియన్స్
-
డ్రీమ్11 గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ – కేఎల్ రాహుల్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్)
-
అల్ట్రోజ్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది ఇయర్ – కిరాన్ పొలార్డ్ (ముంబయి ఇండియన్స్)
-
లెట్స్ క్రాకిట్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ – ఇషాన్ కిషన్ (ముంబయి ఇండియన్స్ )
-
క్రెడ్ పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – ట్రెంట్ బౌల్ట్
-
పర్పుల్ క్యాప్ అవార్డు – రబాడ (30 వికెట్లు)
-
ఆరెంజ్ క్యాప్ అవార్డు – కేఎల్ రాహుల్ (670 పరుగులు)
-
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – జోఫ్రా ఆర్చర్
Advertisement
Next Story