డబ్ల్యూహెచ్‌వో విచారణకు సహకరిస్తాం : చైనా

by  |
డబ్ల్యూహెచ్‌వో విచారణకు సహకరిస్తాం : చైనా
X

బీజింగ్: చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లో కరోనా వైరస్ పుట్టిందని అమెరికా పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ వైరస్ ఎక్కడ నుంచి ఉద్భవించిందో చైనాకు తెలుసని.. అంతే కాకుండా జరిగిన పరిణామాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు తెలిసినా బయటకు వెల్లడించలేదని అమెరికా అంటోంది. కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై అంతర్జాతీయ విచారణ చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా డిమాండ్ చేశారు. తాజాగా వైరస్ పుట్టుక గురించి విచారణ చేసేందుకు చైనా ప్రభుత్వం డబ్ల్యూహెచ్‌వోకు అనుమతి ఇచ్చింది. ఈ విచారణ రాజకీయ కోణంలో చేపట్టరాదని, కేవలం శాస్త్రీయ పద్ధతిలోనే విచారణ కొనసాగించాలని చైనా ఆంక్షలు విధించింది. వైరస్ ముందుగానే ఇతర ప్రదేశాల్లో పుట్టిందని తాజాగా చైనా ఆరోపిస్తోంది. వూహాన్ ల్యాబ్‌లో పుట్టిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చేసిన ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. మరోవైపు చైనాలో శుక్రవారం కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని చైనా ప్రకటించింది.

Tags: WHO, Coronavirus, Covid 19, China, Investigation


Next Story

Most Viewed