వ్యాక్సిన్ నేషనలిజానికి అంతం పలకండి: డబ్ల్యూహెచ్‌వో

by Shamantha N |
వ్యాక్సిన్ నేషనలిజానికి అంతం పలకండి: డబ్ల్యూహెచ్‌వో
X

జెనీవా: స్వప్రయోజనాలను ఆశించి కరోనా టీకా ఇతరుల కంటే ముందు తమకే సరిపడా సమకూర్చుకోవాలని భావిస్తే కరోనా మహమ్మారి మరింత ముదురుతుందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనామ్ గెట్రియాసస్ (WHO Chief Tedros Athenaeum Getriasus) అన్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ స్వప్రయోజనాల కోసం దేశాలు వ్యవహరించరాదని, ఏ ఒక్కరికి కరోనా ఉన్నప్పటికీ అది అందరికీ ముప్పేనని తెలిపారు.

కాబట్టి వ్యాక్సిన్ (Vaccin) నేషనలిజానికి అంతం పలకాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు, బహుళపక్ష కోవాక్స్ వ్యాక్సిన్ (Multivitamin Kovacs vaccine) ప్రయత్నాల్లో పాలుపంచుకోవాలని సభ్యదేశాలందరికీ ఆయన లేఖలు పంపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా యువత నుంచే ఎక్కువగా వ్యాపిస్తున్నదని డబ్ల్యూహెచ్‌వో (WHO) పశ్చిమ ప్రాంత డైరెక్టర్ తకేషి కసాయ్ తెలిపారు.

20, 30, 40వ పడిలో ఉన్నవారే ఎక్కువ మంది వైరస్ వాహకులుగా మారుతున్నారని చెప్పారు. కరోనా సోకినట్టు స్వయంగా గుర్తించకోకపోవడంతో ఇతరులకు వీరు ప్రమాదకారులుగా మారుతున్నారని వివరించారు. ముఖ్యంగా బలహీనులకు వైరస్ సోకిస్తున్నట్టు వారు తెలుసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed