ఇంటర్నెట్ డౌన్‌లోడింగ్ స్పీడ్‌లో ఆసియానే టాప్

by  |
ఇంటర్నెట్ డౌన్‌లోడింగ్ స్పీడ్‌లో ఆసియానే టాప్
X

దిశ, వెబ్‌‌డెస్క్: కరోనా వేళ అనే కాదు.. అసలు ఇంటర్నెట్ లేని జీవితాన్ని ఊహించగలమా? లేదు కదా! ఎందుకంటే మనం టెక్నాలజీ యుగంలో బతుకుతున్నాం. పెద్ద ప్రపంచాన్ని చిన్ని మొబైల్‌లో బంధించేశాం. పెద్ద పెద్ద పనుల్ని.. చిటికెన వేలుతో చిటికెలో చేసేస్తున్నాం. ఒకప్పుడు గుడిసెల్లోకి టీవీలు వచ్చినట్లే.. పల్లెల్లోకి, మారుమూల ప్రాంతాల్లోకి ఇంటర్నెట్ సేవలు వచ్చేశాయి. అయితే, మరి ఈ టెక్ ఎరాలో.. ఇంటర్నెట్ ఫ్రీ సిటీలు ఏవి? ట్రావెలర్స్‌కు ఈజీగా ఫ్రీ వైఫై స్పాట్లు యాక్సెస్ చేసుకునే సదుపాయం ఎక్కడుంది? యావరేజ్ డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్ ఎంత? యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఇంటర్నెట్ ఎంత? ప్రపంచవ్యాప్తంగా ఉన్న 31 సిటీల్లో బిజినెస్ ఫైబర్ అనే సంస్థ సర్వే జరిపి ఈ వివరాలను వెల్లడించింది.

మోస్ట్ ఇంటర్నెట్ ఫ్రెండ్లీ సిటీ..

మోస్ట్ ఇంటర్నెట్ ఫ్రెండ్లీ సిటీగా లండన్ టాప్ ప్లేస్‌ దక్కించుకుంది. లండన్ వ్యాప్తంగా 6,88,126 వైఫై హాట్ స్పాట్లు ఉన్నాయి. అంతేకాకుండా 3,981 రెస్టారెంట్లు తమ కస్టమర్లకు ఫ్రీ వైఫై ఫెసిలిటీని కల్పిస్తున్నాయి. యావరేజ్ డౌన్‌లోడ్ స్పీడ్ 34.3 ఎంబీపీఎస్ కాగా, యావరేజ్ అప్‌లోడ్ స్పీడ్ 32.8 ఎంబీపీఎస్‌గా ఉంది. యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఇంటర్నెట్ 31.55 పౌండ్స్ (రూ. 2990/-). ఇక ఈ విషయాల్లో టోక్యో రెండోస్థానంలో నిలిచింది. పారిస్, సింగపూర్, న్యూయార్క్ సిటీ, అమ్‌స్టర్‌డ్యామ్, బార్సిలోనా, బ్యాంకాక్, సియోల్, ఓసాకాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

లీస్ట్ ఇంటర్నెట్ ఫ్రెండ్లీ సిటీస్..

ఈ జాబితాలో దుబాయ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ కేవలం 1209 రెస్టారెంట్లు మాత్రమే ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యాన్ని కల్పిస్తుండగా.. సిటీ వ్యాప్తంగా 108,479 వైఫై హాట్ స్పాట్లు ఉన్నాయి. ఇక్కడ యావరేజ్ డౌన్‌లోడ్ స్పీడ్ 14.3 ఎంబీపీఎస్ కాగా, యావరేజ్ అప్‌లోడ్ స్పీడ్ 7.2 ఎంబీపీఎస్. యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఇంటర్నెట్ 81.09 పౌండ్లు (రూ. 7,691/-). ఈ జాబితాలో ఆగ్రా రెండో స్థానంలో నిలిచింది. షింగాయ్ (చైనా), అంతల్యా(టర్కీ), షెంగెన్(చైనా), ఢిల్లీ, ఇస్తాంబుల్, ముంబై, కౌలలాంపూర్, తైపే తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

లీడింగ్ 5జీ హాట్‌స్పాట్ సిటీస్..

టాప్ వన్ ప్లేస్‌లో నిలిచిన సియోల్‌లో 5జీ హాట్‌స్పాట్లు 83 ఉన్నాయి. లాస్ ఏంజెల్స్‌లో 40, లండన్‌లో 35, మియామీలో 14 ఉన్నాయి.

ఫాస్టెస్ట్ డౌన్‌లోడ్ స్పీడ్ కేటగిరీలో ఆసియా టాప్..

ఆసియాలోని నగరాలు.. ఫాస్టెస్ట్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను అందిస్తున్నాయి. ఇందులో సింగపూర్ మొదటిస్థానంలో ఉండగా.. ఇక్కడ డౌన్‌లోడింగ్ స్పీడ్ 54.6గా ఉంది. ఆ తర్వాత టోక్కో 45.2, బ్యాంకాక్, థాయ్‌లాండ్‌లు 37.6 ఎంబీపీఎస్ డౌన్‌లోడింగ్ స్పీడ్‌ను అందిస్తున్నాయి.



Next Story