- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్‌లో కౌంటింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడో తెలుసా?
దిశ, క్రైమ్ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల ఘట్టం తుది దశకు చేరుకుంది. ఎన్నికలు ముగిసిపోవడంతో ఇక లెక్కలు తేలడమే ఆలస్యం కానుంది. ఈ సందర్భంగా నగర పోలీసులు బ్యాలెట్ బాక్సులలో ఓటర్లు తేల్చిన రాజకీయ నేతల భవితవ్యం స్పష్టం కావడానికి ఇక కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. నగర పోలీసులు బ్యాలెట్ బాక్సులను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ లకు కట్టుదిట్టమైన భత్రను ఏర్పాటు చేశారు. టీఎస్ఎస్‌పీ, ఆర్డ్మ్ రిజర్డ్వ్, సివిల్ బలగాలను మూడు విభాగాలను మూడు రింగులలో ఏర్పాటు చేశారు.
పోలింగ్ ముగిసిన రోజు రాత్రే వీడియో చిత్రీకరణ చేస్తూ.. ఈ స్ట్రాంగ్ రూమ్ లను సీజ్ చేసినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. నగర వ్యాప్తంగా 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. పోలింగ్ కౌటింగ్ కేంద్రాలను సర్కిళ్ల వారీగా ఏర్పాటు చేయగా, ఆ కేంద్రాలను పలు ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు.
నగర పౌరులు, కౌంటింగ్ కేంద్రాల వద్దకు వచ్చే ఏజెంట్లు పోలీసులు ఏర్పాటు చేసిన ప్రాంతాలలోనే తమ వాహనాలను పార్క్ చేయాల్సి ఉంటుందని ఆంక్షలు విధించారు. ఈ కౌంటింగ్ కేంద్రాలకు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, ఏజెంట్లతో పాటు ఎన్నికల అధికారులు జారీ చేసిన పాస్ ఉన్ వారు మాత్రమే రావాలని నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. అంతే కాకుండా, ఇంకా ఏమైనా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్లయితే హైదరాబాద్ సిటీ పోలీస్ ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియజేస్తాం అన్నారు.
కౌంటింగ్ కేంద్రాల జాబితా:
– కార్వాన్ సర్కిల్ పరిధిలోని 6 వార్డులకు ఎల్‌బీ స్టేడియంలోని బాక్సింగ్, జిమ్నాజియం హాల్లో కౌంటింగ్ నిర్వహిస్తారు. గోషామహాల్ సర్కిల్ పరిధిలోని 6 వార్డులకు నిజాం కళాశాల ఓపెన్ గ్రౌండ్ లో కౌంటింగ్ జరుగుతోంది. ఈ కేంద్రాలకు వచ్చే వారు నిజాం కాలేజ్ గ్రౌండ్స్, మహబూబియా కాలేజ్, ఆలియా కాలేజ్, పబ్లిక్ గార్డెన్ పార్కింగ్ ప్లేస్, ఎల్‌బీ స్టేడియం ఆఫీసీయల్స్ టెన్నీస్ కోర్టులలో తమ వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
– ముషీరాబాద్ సర్కిల్ పరిధిలోని 6 వార్డులకు దోమలగూడ ఏవీ కళాశాలలోని లా కాలేజ్ కౌంటింగ్ జరుగుతోంది. ఈ కేంద్రానికి వచ్చే వారు ఏవీ కళాశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ గ్రౌండ్, పీఈటీ కాలేజ్ గ్రౌండ్, ఎన్టీయార్ స్టేడియంలలో పార్కింగ్ చేయాలి.
– సంతోష్ నగర్ సర్కిల్ లోని 6 వార్డులకు బండ్లగూడలోని మహావీర్ ఇనిస్టిటూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో కౌంటింగ్ ఉంటుంది. ఈ కేందానికి వచ్చే వారు మహావీర్ ఇంజనీర్ కాలేజ్ లో పార్కింగ్ చేయాలి
– చాంద్రాయణగుట్ట సర్కిల్ పరిధిలోని 7 వార్డులకు బండ్లగూడలోని అరోరా లీగల్ సైన్సెస్ అకాడమీలో కౌంటింగ్ జరుగుతోంది. అరోరా కాలేజ్ పార్కింగ్ ప్రాంతంలో వాహనాలను పార్క్ చేయాలి.
– చార్మినార్ సర్కిల్ పరిధిలోని 5 వార్డులకు హైకోర్టు రోడ్డులోని ప్రభుత్వ సిటీ కాలేజ్ లో కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ కేంద్రానికి వచ్చే వారు కులీకుతుబ్ షా స్టేడియంలో పార్కింగ్ చేసుకోవాలి.
– మలక్ పేట సర్కిల్ లోని 7 వార్డులకు అంబర్ పేట మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఉంటుంది. అంబర్‌పేట జీహెచ్ఎంసీ గ్రౌండ్‌లో, అంబర్ పేట ఎంసీహెచ్ కాలనీ గ్రౌండ్ లో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
– సికింద్రాబాద్ సర్కిల్ లోని 5 వార్డులకు ఉస్మానియా యూనివర్శిటీ కామర్స్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతుండగా, మేనేజ్మెంట్ కాలేజ్ లో వాహనాలను పార్క్ చేయాలి
– ఫలక్‌నూమా సర్కిల్ పరిధిలోని 6 వార్డులకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆవరణలోని కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ ఉండగా, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనే వాహనాలను పార్క్ చేసుకోవాలి.
– మెహిదీపట్నం సర్కిల్ లోని 7 వార్డులకు మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చే వారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, విజయ్ నగర్ కాలనీలోని హాకీ గ్రౌండ్ లో పార్క్ చేయాలి.
– జూబ్లీహిల్స్ సర్కిల్ లోని 4 వార్డులకు బంజారాహిల్స్ సుల్తాన్ ఉలుమ్ ఎడ్యుకేషన్ క్యాంపస్ లో కౌంటింగ్ జరుగుతోంది. ఈ కౌంపస్ లోనే పార్కింగ్ సదుపాయం ఉంది.
– యూసుఫ్‌గూడ సర్కిల్ పరిధిలోని 5 వార్డులకు కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది. అదే స్టేడియంలో పార్కింగ్ సౌకర్యం కలదు.
– బేగంపేట సర్కిల్ పరిధిలోని 4 వార్డులకు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ రోడ్డులోని వెస్లీ కాలేజీలో కౌంటింగ్ జరగనుంది. అదే కాలేజ్ ఆవరణలోనే పార్కింగ్ సదుపాయం ఉంది.
– ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని 6 వార్డులకు సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కౌంటింగ్ ఉంటుంది.