సుశీల్ కుమార్ అక్కడ ఉన్నాడా..?

by Shyam |
సుశీల్ కుమార్ అక్కడ ఉన్నాడా..?
X

దిశ, స్పోర్ట్స్ : యువ రెజ్లర్ సాగర్ దండక్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. మే 4న ఢిల్లీలోని చత్రాసాల్ స్టేడియంలో సుశీల్ కుమార్, అతని అనుచరులు కలసి సాగర్ దండక్, అతడి స్నేహితులపై హాకీ స్టిక్స్, బేస్ బాల్ బ్యాట్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సాగర్ ప్రాణాలు కోల్పోయాడు. సుశీల్ స్వయంగా దాడి చేస్తున్న వీడియో కూడా పోలీసులకు లభించింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న సుశీల్ కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే సుశీల్ కుమార్, అతడి స్నేహితుల కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

తాజాగా ఢిల్లీ కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. సుశీల్ కుమార్ ఇల్లు, బంధువుల, స్నేహితుల ఇళ్లల్లో సోదాలు జరిపినా అతడి ఆచూకీ తెలియలేదని చెబుతున్నారు. కాగా, హరిద్వార్‌లోని ప్రముఖ యోగా గురువు ఆశ్రమంలో సుశీల్ కుమార్ ఉన్నట్లు వార్తలు ఉన్నాయి. దీనిపై పోలీసులను ప్రశ్నించగా.. తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. అయితే సుశీల్ కుమార్ హరిద్వార్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాడని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed