ఇంద్రకీలాద్రీపై దసరా ఉత్సవాలు ఎప్పుడంటే…

by  |
ఇంద్రకీలాద్రీపై దసరా ఉత్సవాలు ఎప్పుడంటే…
X

దిశ వెబ్ డెస్క్: ఇంద్ర కీలాద్రిపై శీ శార్వరీ నామ సంవత్సర దసరా ఉత్సవాలు అక్టోబర్17 నుంచి ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు పది అంకారాలల్లో దర్శనమివ్వనున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 18న శ్రీ బాలా త్రిపురు సుందరీ దేవీగా, 19న శ్రీగాయత్రీ దేవీ, 20న శ్రీ అన్నపూర్ణ , 21న శ్రీ సరస్వతీ దేవీ, 22న లలితా త్రిపుర సుందరీ, 23న మహాలక్ష్మీ, 24న శ్రీ దుర్గాదేవీగా దర్శనమివ్వనున్నారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న వారిని మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. రోజుకు 9వేలకు అనుమతించాలనుకోగా ఇప్పుడు ఆ సంఖ్యను పెంచాలని ఆలోచిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.


Next Story

Most Viewed