నన్ను అనుమానంతో చూశారు : సైఫుద్దీన్

by Shyam |
నన్ను అనుమానంతో చూశారు : సైఫుద్దీన్
X

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ ఆటనే కెరీర్‌గా మలుచుకొని.. జట్టు కోసం ఎంతో నిబద్దతో ఆడుతున్న సమయంలో ఎవరైనా మనపై అనుమానాలు వ్యక్తం చేస్తే చాలా బాధగా ఉంటుందని బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మహ్మద్ సైఫుద్దీన్ అన్నాడు. గత వన్డే ప్రపంచకప్‌లో ఇండియాతో మ్యాచ్ అనంతరం గాయాలపాలై డ్రస్సింగ్ రూంకే పరిమితం అయిన సమయంలో చాలా మంది నన్ను అనుమానపు చూపులతో చూశారని.. నా నిబద్ధతను ప్రశ్నించారని.. అప్పుడు చాలా బాధపడ్డానని ఈ యువ ఆల్‌రౌండర్ ఆవేదన వ్యక్తం చేశాడు. వన్డే ప్రపంచకప్ కంటే ముందు మేం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లాం. అప్పుడే తాను వెన్ను నొప్పితో బాధపడ్డాను. అయినా ఆ సిరీస్‌లో తాను మంచి ప్రతిభ కనపర్చాను. బంగ్లాదేశ్ జట్టు విదేశీ గడ్డపై తొలి సారి సిరీస్ గెలుచుకుంది కూడా అప్పుడే అని సైఫుద్దీన్ చెప్పాడు. ఇక వెంటనే ఇంగ్లాండ్‌లో వన్డే ప్రపంచకప్ కోసం వచ్చాం. ఆ సమయంలో ఇంజక్షన్లు తీసుకొని మ్యాచులు ఆడేవాడిని.. తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడినప్పుడే తాను ఇంజక్షన్లు తీసుకున్నానని.. ఇక భారత్ మ్యాచ్‌లో ఇంజెక్షన్ తీసుకునే ఆడానని చెప్పాడు. కానీ ఆ తర్వాత మ్యాచ్ ఆడలేకపోయానని.. ఆసీస్‌తో మ్యాచ్ కావాలనే ఆడలేదని కొందరు సహచరులు, ఫ్యాన్స్ నన్ను అనుమానంగా చూడటం ఎంతో కుంగదీసిందని చెప్పాడు. అయితే గత కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న సైఫుద్దీన్ లాక్‌డౌన్ ముందు జరిగిన బంగ్లాదేశ్ సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు.

Advertisement

Next Story