- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాకు అతనిపై క్రష్ ఉంది: సింగర్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా : పాప్ సింగర్ సెలెనా గోమెజ్, మార్వెల్ సంస్థ నిర్మించిన అవెంజర్స్ సిరీస్‌లో కెప్టెన్ అమెరికాగా చేసిన క్రిస్ ఎవాన్స్‌కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తాజాగా వీరిద్దరి గురించి క్రేజీ రూమర్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ షోలో పాల్గొన్న సెలెనాని ‘ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారు, మీ నంబర్ వన్ హాలీవుడ్ క్రష్ ఎవరు? అని హోస్ట్ అడగగా.. ‘నాకు క్రిస్ ఎవాన్స్‌పై క్రష్ ఉంది. అతను చాలా అందంగా ఉంటాడ’ని తెలిపింది. కాకపోతే అతనితో ప్రేమ అనేది జరగక పోవచ్చని వివరించింది ఈ బ్యూటీ. అయితే తాజాగా కెప్టెన్ అమెరికా నటుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సెలెనాని ఫాలో అవ్వడం మొదలు పెట్టగా.. దీంతో వాళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారి అభిమానులు సైతం వారు ప్రేమలో ఉన్నారంటూ కొన్ని పిక్స్‌ను వైరల్ చేస్తున్నారు. అయితే వారిద్దరూ కలిసి ఉన్న ఒక్క ఫోటో కూడా లేకపోవడం గమనార్హం. ఇక ఈ పాప్ సింగర్ సెలెనా.. ఫేమస్ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్, ప్రియాంక చోప్రా భర్తతో డేటింగ్ చేయగా, క్రిస్ జెస్సికా బీల్, జెన్నీ స్లేట్‌తో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే.