ఎంపీడీవో అలా చేసే సరికి… ఏడ్చేసిన ఎంపీపీ సుకన్య..

by Anukaran |   ( Updated:2021-07-10 07:43:41.0  )
mpp sukanya
X

దిశ, అబ్దుల్లాపూర్‌మెట్ : యాచారం మండల పల్లె ప్రగతి ప్రణాళిక ముగింపు సమావేశం రసాభాసగా మారింది. ఎంపీడీవో వైఖరి సరిగా లేదంటూ, ఏ కార్యక్రమానికి సమాచారం ఇవ్వడంలేదంటూ ఎంపీపీ సుకన్య భాషా బోరున విలపించారు. ఎంపీడీవో మమత వైఖరి పట్ల మనస్తాపానికి గురై సమావేశం నుంచి సుకన్య రోదిస్తూ బయటకి వెళ్లిపోయారు. ఎంపీడీవో మమత ఏ సమావేశం నిర్వహించినా ప్రొటోకాల్ పాటించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామ సభలకు కనీసం నిర్ణీత సమయానికి రాకుండా అగౌరవ పరుస్తున్నారని అన్నారు. జవాబుదారీగా ఉండాల్సిన ఎంపీడీవో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి దాపురించిందని సుకన్య కంటతడి పెట్టారు. మమత ఎంపీడీవోగా ఉంటే నేను ఎంపీపీగా కొనసాగలేనని, పదవికి రాజీనామా చేస్తానని బోరున విలపించారు. సుకన్య భాషాకు పలువురు నాయకులు, అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

Advertisement

Next Story