వాట్సాప్‌లో యానిమేటెడ్ స్టిక్కర్లు

దిశ, వెబ్‌డెస్క్: యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవలి కాలంలో.. మెసేజింగ్ యాప్స్‌లో స్టిక్కర్లు బాగా క్లిక్ అయ్యాయి. యూత్‌ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. హైక్, స్నాప్‌చాట్ తరహాలో వాట్సాప్‌లోనూ ఇకపై యానిమేటెడ్ స్టిక్కర్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా, కొత్తగా వచ్చే ఈ యానిమేటెడ్ స్టిక్కర్స్‌లో త్రీ ఆస్పెక్ట్స్ ఉంటాయని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన ‘బీటా’ వర్షన్‌‌ను సెలెక్టెడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఈ యానిమేటెడ్ స్టిక్కర్లను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ స్టోర్‌లో ఉన్న ‘ప్లేఫుల్ పియోమరు’ అనే యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ యానిమేటెడ్ స్టిక్కర్లను సదరు యూజర్ మాత్రమే చూసే అవకాశం ఉండగా, ఎక్స్‌టెన్షన్ ద్వారా వాటిని రిసీవ్ చేసుకున్న వ్యక్తులు కూడా.. సేవ్ చేసుకుని ఇతరులకు షేర్ చేసుకునే అవకాశం కల్పించింది. థర్డ్ పార్టీల నుంచి యానిమేటెడ్ స్టిక్కర్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇలా ఇందులో త్రీ ఆస్పెక్ట్స్ ఉన్నట్లు వాట్సాప్ పేర్కొంది.

Advertisement