వాట్సాప్‌లో స్టిక్కర్స్ సెర్చ్ ఆప్షన్

by Harish |
వాట్సాప్‌లో స్టిక్కర్స్ సెర్చ్ ఆప్షన్
X

దిశ, వెబ్‌డెస్క్ : యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మధ్య మెసేజింగ్ యాప్స్‌లో స్టిక్కర్లు బాగా క్లిక్ అయ్యాయి. ఈ క్రమంలోనే హైక్, స్నాప్ చాట్ మాదిరిగా వాట్సాప్‌ కూడా యానిమేటెడ్ స్టిక్కర్లను తమ యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. సాధారణ స్టిక్కర్లతో పాటు యానిమేటెడ్ స్టిక్కర్లను సైతం యూజర్లు అధికంగా యూజ్ చేస్తున్నారు. కాగా, వీటికోసం మరో కొత్త ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకురాబోతుంది.

వాట్సాప్‌లో రకరకాల స్టిక్కర్లు.. చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అయితే నచ్చిన స్టిక్కర్‌ను వెంటనే సెండ్ చేయాలంటే మాత్రం కొంచెం కష్టమైన పనే. ఆ స్టిక్కర్లలో వాటిని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇకపై వాటిని సులువుగా సెర్చ్ చేయొచ్చు. గతంలో ఈ ఫీచర్ కేవలం ఎమోజీ, జిఫ్ ఫైల్స్‌కు మాత్రమే ఉండేది. ఉదాహరణకు.. ప్రస్తుతం వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. ప్రకృతిని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మూడ్‌ను బట్టి.. హ్యాపీ అని టైప్ చేస్తే.. మన సంతోషాన్ని సూచించే ఎమోజీలు కనిపిస్తాయి. అలా వాటిని ఈజీగా సెర్చ్ చేసి సెండ్ చేసే వీలుంది. అలానే సాడ్, బర్త్ డే, లవ్, యాంగ్రీ ఇలా ఎమోజీలను, జిఫ్‌లను సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు స్టిక్కర్లను కూడా మూడ్ తగ్గట్టుగా సెర్చ్ చేసే అవకాశం రానుంది. అయితే ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లోనే ఈ ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందరికీ రానుంది.

Advertisement

Next Story

Most Viewed